Header Banner

టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్! ఇక ఆ సమస్యలకు చెక్!

  Mon May 05, 2025 18:18        Others

తిరుమల ఘాట్ రోడ్లు తరచూ పాడవుతుండటంతో టీటీడీ మరమ్మతులు చేపట్టనుంది. భక్తుల రద్దీ, భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. 10.75 కోట్ల రూపాయలతో రెండు ఘాట్ రోడ్లకు మరమ్మతులు చేయనున్నారు. బిట్యూమినస్ కాంక్రీట్, మెకాడమ్ వంటి వాటితో రోడ్లను బాగుచేసి, రోడ్డు మార్కింగ్స్, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. వర్షాకాలం రాకముందే పనులు మొదలు పెట్టడానికి టెండర్లు పిలవనున్నారు. ఈ రోడ్ల మరమ్మత్తులు పూర్తయితే భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

 

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు.. వారిలో కొందరు సొంత వాహనాల్లో, మరికొందరు ఆర్టీసీ బస్సుల్లో, ఇంకొందరు ట్యాక్సీల్లో కొండపైకి వస్తారు. తిరుమలకు చేరుకోవడానికి.. దర్శనం తర్వాత తిరిగి వెళ్లడానికి తిరుమల ఘాట్ రోడ్లు చాలా కీలకం. అయితే ఈ మేరకు తిరుమల ఘాట్ రోడ్లకు మరమ్మతులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. దీని కోసం రూ.10.75 కోట్లు ఖర్చు చేయనున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండవ ఘాట్ రోడ్డు, తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డుకు మరమ్మతులు చేస్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ రోడ్లు తరచూ పాడవుతున్నాయి.. అందుకే టీటీడీ ఈ మరమ్మతులు చేపట్టనుంది.


ఇది కూడా చదవండి: శ్రీశైలం ఆలయంలో హుండీ చోరీ కలకలం..! ఇద్దరు మైనర్లు సహా నలుగురు అరెస్ట్!

 

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డు 17 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డు 18 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ రెండు రోడ్ల మీదుగా రద్దీని రోజుకు 10 వేల వాహనాలు వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. లారీలు, టిప్పర్లు కూడా తిరుగుతుండటంతో రోడ్లు తొందరగా దెబ్బతింటున్నాయి. ఈ ఘాట్ రోడ్లను చివరిసారిగా 2021 జనవరిలో రోడ్లను బాగు చేశారు.. అప్పుడు బీటీ రెన్యూవల్ కోట్ వేశారు. కరోనా తర్వాత వాహనాల సంఖ్య బాగా పెరిగింది.. 2021 నవంబర్, డిసెంబర్ నెలల్లో భారీ వర్షాలు కురవడంతో పాటుగా.. డ్రైనేజీ, క్రాష్ బ్యారియర్ పనులు కూడా చేశారు. దీని వల్ల ఘాట్ రోడ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల గుంతలు పడ్డాయి.

 

తిరుమలకు వచ్చే భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ రోడ్లకు బిట్యూమినస్ కాంక్రీట్, బిట్యూమినస్ మెకాడమ్ వంటివి ఉపయోగించి.. వీటిని బాగు చేస్తారు. హాట్ అప్లైడ్ థర్మోప్లాస్టిక్ కంపౌండ్‌తో రోడ్డు మార్కింగ్ చేస్తారు. రైజ్డ్ పేవ్మెంట్ మార్కర్లు (రోడ్ స్టడ్స్), సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు. వర్క్స్ కమిటీ కూడా దీనిపై అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ రోడ్ల పనుల్ని వర్షాకాలం రాకముందే మొదలు పెట్టడానికి టెండర్లను ఆహ్వానించడానికి సిద్ధమవుతోంది టీటీడీ.

 

ఇది కూడా చదవండిఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Andhrapravasi #Tirumala #Tirupati #TirumalaGhats #TTDUpdates #GhatRoads #TirumalaPilgrimage #TirumalaDarshan #TTDRepairsGood news TTD devotees check those problems